Category భక్తి న్యూస్

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (పబ్లిక్ టుడే) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా…

🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.

Spread the love

Spread the love🌾అపుడు నారదులవారు జరిగినదంతయూ గ్రహించి “ఓయీ! ఇంద్రా!దుఃఖింపవలదు, ఇందులకు ఉపాయము తప్పక గలదు.🌾నీవు మానవ రూపమున భూలోకములోనున్న వేంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనందనిలయములోనున్న శ్రీమన్నారాయణులవారిని దర్శింపుము.🌾ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠ వాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతనూ ఆరాధింపబడుతున్న దివ్యప్రదేశం వేంకటాద్రి.…

నేడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి

Spread the love

Spread the loveఓం శ్రీ వాసవాంబాయైనమః ఓం కుసుమ పుత్రీచ విద్మహేకన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్‌ ఉపోద్ఘాతం – చరిత్ర స్త్రీలోని ఆత్మీయతకు , అనురాగానికి , సౌమ్యానికి , త్యాగగుణానికి , పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’ సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ…

టి టి డి ఉచిత వివాహలకు విశేష స్పందన తిరుమల (నవ్యంధ్ర న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తితిదే ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. 2025 మే 1 వరకు తితిదే ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని తితిదే వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love

Spread the love

వైభవంగా రథోత్సవం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర) మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని…

మే 12 నుంచి అన్నమయ్య 617 వ జయంతి ఉత్సవాలు.

Spread the love

Spread the loveరాజంపేట (నవ్యంధ్ర) కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అన్నమాచార్యుల 617 వ జయంతి మహోత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అటు అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామంలో, ఇటు అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు…

వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Spread the love

Spread the loveసులభతరంగా శ్రీవారి సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణకు తెర రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

శ్రీశైలం ఉబ్బలి బసవన్న కధ..

Spread the love

Spread the loveపూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా…

కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే…

Spread the love

Spread the loveకోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. ‘శివ’ అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు,భవుడు,రుద్రుడు,ఉగ్రుడు,భీముడు,పశుపతి,మహాదేవుడు,ఈశానుడు… అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.…

🙏🌼🌼🌼🙏లక్ష్మీ సరస్వతుల కటాక్షం జీవితంలో అందరికీ చాలా ముఖ్యం. అయితే, చిక్కు ఏమిటంటే, సరస్వతి చెంతన లక్ష్మీ ఉండదు. ఉండమని సరస్వతి కోరదు. లక్ష్మీ కటాక్షం చంచలం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి.

Spread the love

Spread the loveకానీ, సరస్వతి కటాక్షం తద్విరుద్ధం. ఈ తల్లి కటాక్షం అరుదుగా లభిస్తుంది. ఒకసారి ఆదరిస్తే ఇక విడువదు. లభించిన కళ కొనవూపిరి వరుకూ ఉంటుంది. కరుణ రసం లక్ష్మీదేవికి తక్కువ. ఎప్పుడు కాలం వక్రీకరిస్తుందో, తక్షణం వీడి వెళ్ళిపోతుంది. “అయ్యో పాపం” అనే కనికరం ఏ కోశానా ఉండదు. మనం చాలామంది విషయంలో…