జిల్లా కలెక్టర్ డీఎంఎసి అధ్యక్షులు శ్రీధర్ చెరుకూరి
వైయస్సార్ కడప జిల్లా జనవరి 30
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు
తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందనీ డిఎంఎసి చైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డీఎంఎసి చైర్మన్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అర్హులైన జర్నలిస్టు
లందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశామని,మొదటి సమావేశంలో 569
మంది జర్నలిస్ట్ లకు కమిటీ ఆమోదం తెలిపిందనన్నారు. ఇంకనూ అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి,వివిధకారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులనుపరిశీలించి తదుపరి సమావేశంలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు,డి ఎం ఏ సి కన్వీనర్ పద్మజ,
డివిజనల్ పీఆర్వో సునీల్ సాగర్,ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి , డీఎంహెచ్ నాగరాజు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రంగ రాజు, పిడి హౌసింగ్ రాజారత్నం,రైల్వేపీఆర్వో జనార్ధన్,బ్యూరో చీఫ్ విశాలాంద్ర పి.రామసుబ్బారెడ్డి,
బ్యూరో చీఫ్ ఆంధ్ర జ్యోతిఈ.ఆంజనేయలు, స్టాఫ్ రిపోర్టర్ ప్రజాశక్తి నూర్ బాషా,స్టాఫ్ రిపోర్టర్ ఈ టివి జి.మురళి మోహన్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్ హెచ్ యంటివి వి.యం.చంద్ర మోహన్ రాజు, రిపోర్టర్,వార్త ఆర్.మనోహర్,రిపోర్టర్ ఆంధ్రప్రభ ఐ.సి.సుబ్బారెడ్డి,ఎడిటర్ రాయలసీమ సమయం ఏ.సందీప్ కుమార్ రెడ్డి,ఎడిటర్ కొత్త తరంగం కె.రమేష్,స్టాఫ్ రిపోర్టర్ మహా న్యూస్ యు.శ్రీకాంత్, కరస్పాండెంట్ ప్రసార్ భారతి,బి.శ్రీనాథ్ రెడ్డి, ఫోటోగ్రాఫర్,ఆంధ్రజ్యోతి టి.రత్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

