అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04
(నవ్యంధ్ర న్యూస్ )
12 వ పి ఆర్ సి కమిషన్ ను వెంటనే నియమించి 30 శాతం ఐ ఆర్ ప్రకటించాలనీ ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిల చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్రసంయుక్త అధ్యక్షులువైసుబ్రమణ్యం రాజు,ఉపాధ్యక్షులు
జి ఆదినారాయణ రెడ్డలు డిమాండ్ చేశారు.
రాజంపేట మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎస్.టి.యు రీజినల్ కన్వీనర్ నరసింహులు అధ్యక్షతన ఎస్.టి.యు రీజినల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా నరసింహులు పాల్గొన్నారు.
ఈసందర్బంగా
నరసింహులు
మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల పూర్తయిన ఏ ఒక్క సమస్య పై స్పష్టమైన హామీఇవ్వడంలేదన్నారు.ఒక సానుకూల
వాతావరణంలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి
ఈ దశలో చర్చలకు సంఘాలను పిలిచి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. 10 వ తరగతి 100 రోజుల ప్రణాళికలో భాగంగా సెలవు రోజులు మినహాయించాలని డిమాండ్ చేశారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలని
సుప్రీంకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 51 కట్టుబడి ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి మాట్లాడుతూ అసెస్మెంట్ పుస్తకాలు,సిలబస్ కు సంబంధం లేకుండా ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కారానికి చొరవ చూపే సమయం ఆసన్నమైందని,నెలవారి పదోన్నతులు,హై స్కూల్ ప్లస్ లో ఖాళీల భర్తీ చేయడం,వివిధ అనారోగ్య,ప్రమాదాల కారణాలతో మరణించిన ఉపాధ్యాయుల
కుటుంబాలకు కారుణ్య నియామకాలు సత్వరం చేపట్టడానికి వీలుగా నిబంధనలను
సవరించాలని, పాఠశాల సమయాన్ని
ఉపాధ్యాయుడికి పూర్తిగా బోధనా అభ్యసన ప్రక్రియలకు పరిమితం చేయాలని,డీఎస్సీ 2003 ఉపాధ్యాయులందరికీ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానంలోకి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రితో చర్చించి సత్వర న్యాయం చేసేలా జోక్యం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో
ఎస్.టి.యు
జిల్లా అధ్యక్షులు అంకం శివారెడ్డి,
జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్,
సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్,రాష్ట్ర
నాయకులు డివిజనల్ కన్వీనర్ నరసింహులు, మురళి మనోహర్,
ఎస్. ఎస్. రాజు, అశోక్,ఓబులేష్, సత్యనారాయణ,గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, నాగరాజు, సుబ్బారెడ్డి, మోహనరావు,
వెంకటేశ్వరరెడ్డి, మోహనరాజు, నరేంద్ర వివిధ మండలాల అధ్యక్ష ప్రధానఆర్థికకార్యదర్శులు జిల్లా మహిళా కన్వీనర్ అన్నపూర్ణ,మహిళా ఉపాధ్యాయులు,
పాల్గొన్నారు.

