సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి

Spread the love

విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణకు ఘన సత్కారం

కడప జిల్లా ఏప్రిల్ 03

(నవ్యంధ్ర న్యూస్ ).

సర్పంచ్ జంబు సూర్యనారాయణ భవిషత్ లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు విశిష్ట సేవలు అందించాల్సిన బాధ్యత నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పై ఉందని నందలూరు మండల రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు జీవి రమణ చక్రాల రామసుబ్బన్న మహంకాలయ్య ఖాదరవల్లి పలువురు అన్నారు. నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ పదవి బాధ్యతలు పూర్తయిన సందర్భంగా సచివాలయంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంబు సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య చెప్పిన వాటిని వెంటనే పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ గుర్తింపు పొందారన్నారు. సర్పంచ్ పదవి చేపట్టగానే ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న వ్యక్తిగా నాగిరెడ్డి పల్లెలో నిలిచిపోయారన్నారు. ప్రజలకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా సకాలంలో పూర్తి చేసి అధికార దర్పం చూపకుండా సామాన్య మానవుడిలా జంబు సూర్యనారాయణ పాలన సాగిందన్నారు. ఒక మంచి వ్యక్తి నాయకుడు ప్రజలకు మేలు జరుగుతుందని అలాంటి వ్యక్తులలో
జంబు సూర్యనారాయణ ఒకరన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో ఏ పదవికి పోటీ చేసిన తమ వంతు సహకారం అందిస్తామన్నారు.విశ్రాంత ఎంపీడీవో గొర్ల వెంకటరత్నం మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఎంపీటీసీగా నిలబడి అవకాశం వస్తే ఎంపీపీ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవతోపాటు ప్రజల సేవలు చేయడం కొంతమందికే అవకాశం లభిస్తుందన్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయం పూర్తి చేసి సకాలంలో ప్రారంభించి ఉంటే ప్రజలకు మేలు జరిగి ఉండేదన్నారు.
ఈ సందర్భంగా జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు ఇచ్చినందుకు అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసిన వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకు వెళ్లానని ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను తనకు తెలిసిన వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు ప్రస్తుతం రాజకీయాలు మనం అనుకున్నంత సులువుగా లేవని అన్నారు. బాధ్యత పని బాటలేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని అటువంటి విమర్శలు తాను పట్టించుకోరు అన్నారు. సచివాలయం ఒకటి ప్రారంభించాలని ఎంతో ప్రయత్నించామని చాలా మంది అడ్డ పుల్లలు వేశారన్నారు. ప్రస్తుతం కుల పిచ్చి చాలా ఎక్కువ కావడంబాధాకరమన్నారు.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అవకాశం ఆ భగవంతుడిస్తే మళ్లీ ప్రజాసేవలో ఉంటానన్నారు.
అనంతరం జంబు సూర్యనారాయణను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు జంబు రవీంద్రబాబు సాంబశివయ్య గొబ్బిళ్ళ సుబ్బరామయ్య నరసింహారావు రమణ వసంత రాయలు సురేష్ కుమార్ సునీల్ కుమార్ హరినాథ్ సుబ్బారావు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *