కడప జిల్లా మార్చి 17
(నవ్యంధ్ర న్యూస్ )
నందలూరులో వెలసియున్న శ్రీసౌమ్యనాథ స్వామిని మంగళవారం తెలుగుదేశం రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తనయుడు చమర్తి లోకేష్ రాజు దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా స్థానిక టిడిపి నాయకులు చమర్తి లోకేష్ రాజుకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సింగిల్ విండో అధ్యక్షులు పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, నీటి సంఘం అధ్యక్షులు భూశెట్టి వెంకటసుబ్బయ్య, టిడిపి పాటూరు గ్రామ అధ్యక్షులు ముమ్మడిశెట్టి రమేష్, నాయకులు నారశెట్టి శివ, ఆవుల రమేష్, ఎంపీ రావు, అనిల్ ,సూరి తదితరులు పాల్గొన్నారు.

