కడప జిల్లా మార్చి 26
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట కొలిమివీధిలో వెలసియున్న
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి మొదటి రోజు నుంచి ప్రారంభం కానున్న
నవరాత్రోత్సవాలలో భాగంగా
27-3-2026 శుక్రవారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సీతారాముల అభిషేక కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగును. భక్తాదులందరూ పాల్గొని సీతారాముల కృపను పొందవలసిందిగా మనవి.
శ్రీ సీతారాముల కళ్యాణం
4–4-2026 వ తేదీ శనివారము అబిజిత్ లగ్నమునందు కళ్యాణము తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమము సాయంత్రం 6 గంటల నుండి కొలిమి వీధి పురవీధుల నందు ఊరేగింపు నిర్వహించనని
5-4-2026 వ తేదీ సాయంత్రము 7 గంటలకు సీతారాముల ఉంజలసేవ ఏకాంత సేవలు నిర్వహించి ప్రసాద వినియోగం చేయబడునని
ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ విరివిగా పాల్గొని శ్రీ సీతారాముల కృపను పొంది సర్వ సౌఖ్యాలు సౌభాగ్యాలు పొందవలసిందిగా ఆలయ నిర్వాహకులు తెలియజేసారు.

