కడప జిల్లా మార్చి 09
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద సోమవారం శశిధర్ స్వామి ఆధ్వర్యంలో
శ్రీ శివపార్వతులు,
శ్రీ శ్రీనివాస మహోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు.
ఈ కల్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంతాలలోని భక్తులు విరివిగా పాల్గొని
అ శివపార్వతుల,
శ్రీ శ్రీనివాసుల కృపా కటాక్షాలు పొందారు
ఈ సందర్బంగా శశి స్వామి మాట్లాడుతూ
శ్రీ శివపార్వతుల
శ్రీ శ్రీనివాసుల కళ్యాణాన్ని లోక కళ్యాణం నిమిత్తం నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కళ్యాణంలో మహిళలు యువతులు చేసిన కోలాటం భక్తులను అలరించింది.
కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

