కడప జిల్లా ఫిబ్రవరి 15
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండల
పరిధిలోని వరదయ్య గారి పల్లిలో వెలసియున్న అక్కమ్మ ఆలయ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని మదన గోపాలపురంలో నివాసం ఉంటున్న కొండూరు విశ్వనాధ్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు నారాయణ స్వామి, శివపర్వతుల కల్యాణ
మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ శివపార్వతుల
కల్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంతాలలోని భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివపర్వతుల కృపా కటాక్షాలు పొందారు.
ఈ కల్యాణ మహోత్సవం లో ఆంజనేయ నాయుడు,రామయ్య,వెంకట చలమయ్య, నాగేంద్ర,వెంకటేష్ తదితరులుపాల్గొన్నారు.

