విద్యార్థులు కంటి చూపును మెరుగు పరుచుకోవాలి.

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 25

(నవ్యంధ్ర న్యూస్ )

విద్యార్థినీ విద్యార్థులు కంటి చూపును మెరుగుపరచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించుకోవాలని ప్రధానోపాధ్యారాలు
కె. భారతి కోరారు. రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఇటీవల విద్యార్థినీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలలో పలువురు బాలబాలికలకు కంటి చూపు తేడా గమనించి వారికి ఉచిత కంటి అద్దాలకు ఎంపిక చేసి విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి చూపు పెరగడానికి విటమిన్ ఎసిఈ,జింక్ అధికంగా ఉండే ఆకుకూరలు,క్యారెట్లు, చేపలు,పండ్లు తదితర పౌష్టికాహారం
తీసుకోవాలన్నారు.
కంప్యూటర్లు,మొబైల్స్ ఎక్కువగా వాడేవారని తరచుగా విరామం తీసుకోవాలనీ, రాత్రిపూట బ్లూ లైట్ ఫిల్టర్లువాడాలన్నారు.
రక్షణ కళ్ల ద్దాలు వాడటం మరియు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *