వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.

Spread the love

3 మార్గాలలో దర్శనానికి అనుమతి.

తిరుపతి 22

(నవ్యంధ్ర న్యూస్ )

వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వైకుంఠద్వార దర్శనాల తొలి మూడు రోజులలో మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.
తిరుమల శ్రీవారి వైకుంట ద్వారా దర్శనానికి సమయంఆసన్నమైంది.డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు కల్పించనున్నారు.
శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా,
తోపులాటలు, గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టింది.
వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడు రోజులలో మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
30వ తేదీ (ఏకాదశి), 31వ తేదీ (ద్వాదశి), జనవరి 1వ తేదీలలో మొత్తం 1.76 లక్షల మంది భక్తులకు ఈ డిప్ విధానంలో ముందస్తుగా స్లాటెడ్ సర్వ దర్శన టోకెట్లను కేటాయించింది.
వైకుంఠ ద్వారా దర్శన మొదటి రోజున 5 గంటల వీఐపీ బ్రేక్ దర్శనాల మినహా మిగతా సమయం మొత్తం స్లాటెడ్‌ దర్శన టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే రోజుకు 60,000 మందికి పైగా భక్తులకు,మొత్తం 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేయగా,వీరికి ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ కూడలి నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ఏటీజీహెచ్ నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం కూడలి నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యలో మూడు రోజుల పాటు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ సందర్బంగా భక్తులకు జిల్లా ఎస్పీ టీటీడీ కేటాయించిన స్లాట్ సమయానికి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి.
టోకెన్,ఆధార్/గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
సూచించిన ప్రవేశ మార్గాలనేఅనుసరించాలిమార్గంమార్పుచేయరాదు.పోలీస్,టీటీడీ సిబ్బంది ఇచ్చే ఆదేశాలు,
సూచనలను తప్పనిసరిగా పాటించాలి
గుంపులు గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలకుసహకరించాలి.
అనుమానాస్పద వస్తువులు,వ్యక్తులను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పలు సూచనలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *