వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి 51516/- రూపాయల విరాళం

Spread the love

కడప జిల్లా జనవరి 17 :

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణ శివార్లలోని మన్నూరులో నూతనంగా నిర్మితమవుతున్న
శ్రీ గోదామహాలక్ష్మి సమేత ఐరావత ప్రసన్న
వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులుగంగనపల్లి వెంకటరమణ,హైమావతి దంపతులు శనివారం విరాళం అందజేశారు.
మన్నూరు గ్రామస్తులతో పాటు పలువురు దాతల సహకారంతో నిర్మితమవుతున్న
ఈ ఆలయ నిర్మాణానికి తమవంతుగా 51516/- రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశామనిగంగనపల్లి వెంకటరమణ,హైమావతిలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తుంగా గోపాల్ రెడ్డి,లావనూరు సుబ్బరాయుడు,బైరిశెట్టి కొండయ్య, నారదాసు మధు,నారా మణి, దొంతెం శంకరయ్య, అనుములగుండం లక్ష్మయ్య, మల్లెల చిన్న నరసింహులు, సుబ్బలక్ష్మమ్మ, గంగనపల్లి జగతి, జాగృతీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *