విజయవాడ ఫిబ్రవరి 07
(నవ్యంధ్ర న్యూస్ )
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో
మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 8 నుండి 18 వ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మొదటి ఆహ్వాన పత్రిక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి ఆహ్వానం పలకారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా చక్కగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ నాకు శివుడు అంటే చాలా భక్తి,ఇష్టమని
తన చైర్ పక్కనున్న శివుని విగ్రహం చూపిస్తూ అన్నారు.
శివరాత్రి
బ్రహ్మోత్సవాలకు లేదా తదుపరి శ్రీశైలంకు కచ్చితంగా విచ్చేసి స్వామి,అమ్మవార్లను దర్శించుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో
స్థానిక శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈవో శ్రీనివాసరావు,
వేదపండితులు,బోర్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

