రైల్వే అండర్ బ్రిడ్జ్ బాధితుల నష్టపరిహార అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
చమర్తి
కడప జిల్లా మార్చి 24
(నవ్యంధ్ర న్యూస్ )
రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
“చమర్తి బుధవారం మార్నింగ్ వాక్ ” లో భాగంగా మున్సిపల్ సిబ్బంది,ఎంపీడీవో తెలుగుదేశం నాయకులతో కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని చమర్తి జగన్ మోహన్ రాజు గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కొరకు అక్కడ తొలగించవలసిన భవనాల యజమానులతోస్వయంగా చమర్తి చర్చించి,వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని జగన్ మోహన్ రాజు భరోసా కల్పించారు.
ఈ సందర్బంగా చమర్తి మాట్లాడుతూ స్థానికుల విన్నపం మేరకు మున్సిపల్ స్థలంలో లీజు ప్రాతిపదికన వారు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి షాపులో ఏర్పాటుకు అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు.
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ * రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తాం – టిడిపి నాయకులు,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.
- రైల్వే అండర్ బ్రిడ్జై పై స్పందించిన టిడిపి నాయకులు,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.
- రైల్వే అండర్ బ్రిడ్జ్ బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా – చమర్తి జగన్ మోహన్ రాజు గారు రాజంపేట పట్టణం/ నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట.
రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.
బుధవారం నాడు “చమర్తి మార్నింగ్ వాక్ ” కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మరియు ఎంపీడీవో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని చమర్తి జగన్ మోహన్ రాజు గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కొరకు అక్కడ తొలగించవలసిన భవనాల యజమానులతో స్వయంగా చమర్తి చర్చించి,వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని జగన్ మోహన్ రాజు గారు భరోసా కల్పించారు.
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు మున్సిపల్ స్థలం నందు లీజు ప్రాతిపదికన వారు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి షాపులో ఏర్పాటుకు అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు
బ్రిడ్జ్ నిర్మాణం కొరకు స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని,అక్కడి వ్యాపారస్తులు స్థానికులు తెలపడంతో ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
అనంతరం విద్యార్థులు వ్యాపారస్తులు,
ఎదుర్కొంటున్న,రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి చమర్తి పునాది వేశారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్,
పంచాయతీరాజ్ అధికారులు,పట్టణ, మండలాలతెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

