ఎలాంటి రుసుము లేకుండా పూజలో పాల్గొనవచ్చు
పూజలో పాల్గొనేందుకు భక్తులందరూ ఆహ్వానితులే
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుండి సంకట హర చతుర్థి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనేందుకు భక్తులంతా ఆహ్వానితులేనని పూజలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని శుభప్రదమైన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పిలుపునిచ్చారు.

