రైతు పోరుబాట గోడపత్రాలను ఆవిష్కరించిన వైసిపి ఇన్చార్జ్ ఆకేపాటి
కూటమి ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అకేపాటి భవన్ లో ఆదివారం అన్నదాత పోరుబాట గోడపత్రాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో యూరియా ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు.
ఈ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 9వ తేదీన జిల్లా కేంద్రంలో అన్నదాత పోరుబాట చేపడతామన్నారు
రైతుల సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు,వ్యవసాయ శాఖమంత్రి అచ్చం నాయుడులకు ఏమాత్రం చీమకుట్టినట్టుగా లేదన్నారు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన అచ్చం నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడేనానని ప్రశ్నించారు రైతులు ఇబ్బంధులలో ఉంటే అచ్చం నాయుడుకు బఫే భోజనం గుర్తుకు రావడం దౌర్భాగ్యమన్నారు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎరువు కొరత లేదని గతంలో కంటే ఎక్కువగా ఎరువులు ఇచ్చామని గతంలో కన్నా ఎక్కువ ఎరువులు ఇస్తే రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని,క్యూలో గంటల తరబడి ఎందుకు నిలబడుతున్నారన్నారు
ముఖ్యమంత్రి వై.యస్.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతు సమస్యకు పరిష్కారం దొరికేదని నేడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సమస్యలను పరిష్కారించడం లేదన్నారు రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ
యూరియాతో సహా ఎరువులు కొరత లేకుండా చూసి రైతుల చెంతకు చేర్చాలన్నారు
బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని
ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుని
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు
ఉచిత భీమా పథకాన్ని పునః ప్రారంభించాలని
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు కేవీ వెంకటసుబ్బయ్య,జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి రెడ్డి,జిల్లా పార్టీ నాయకులు వరదరాజులు (బాబు),శేఖర్,
కౌన్సిలర్ సన్ని శెట్టి నవీన్,దయాంద్,వెంకట
రెడ్డి,నియోజవర్గ బిసి సెల్ అధ్యక్షుడు వడ్డే రమణ,ముస్లిం మైనార్టీ అధ్యక్షులుఖాజాముద్దీన్, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ, రాష్ట్ర మైనార్టీల అధ్యక్షుడు జాహీద్, రాష్ట్ర యస్.సి సెల్ కార్యదర్శి దండు గోపి,నియోజకవర్గ నాయకులు సుబ్బరాజు,అమర,
వెంకట రామిరెడ్డి,పట్టణ యస్.సి సెల్ అధ్యక్షుడు బొజ్జపెంచలయ్య,గ్రామీణ మండల కార్యదర్శి బుర్రు సురేంద్ర, ఒంటిమిట్ట మండల కన్వీనర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

