రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న పాత్రికేయులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ

Spread the love

కడప జిల్లా మార్చి 03

(నవ్యంధ్ర న్యూస్ )

నందలూరు మండల జనం పత్రిక పాత్రికేయులు కిరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డరన్న సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ రాజంపేట ఎస్ జీ ఎన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాత్రికేయులను మంగళవారంపరామర్శించి, ఆరోగ్య పరిస్థితి,క్షేమ సమాచారాన్ని
తెలుసుకున్నారు.
ఈ క్లిష్ట సమయంలో కిరణ్ కు ధైర్యాన్ని చెప్పి ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, సర్పంచ్ భరోసా ఇచ్చారు.
మానవత్వంతో వారు చూపిన ఈ చొరవ అభినందనీయమని పాత్రికేయులు సర్పంచ్ మానవతా దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు.
సర్పంచ్ తో పాటు తుమ్మాది శివకుమార్, పఠాన్ మెహర్ ఖాన్, పొంబల నరసింహులు
జనం పాత్రికేయులు కిరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *