ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ
ఏప్రిల్ 16 వ తేదీ నిర్వహిస్తున్న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని పట్టణ, గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి
కడప జిల్లా ఏప్రిల్ 09
( నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట ప్రజల ఆరోగ్యమే తెలుగుదేశం లక్ష్యమని
ప్రతి ఒక్కరికి వైద్యం అందించే లక్ష్యంతో ఇకనుంచి ప్రతి నెల ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తామని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి దుర్వినియోగం చేశారన్న వార్త కథనల పై విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గు తెల్చి,ముఖ్యమంత్రి సహాయనిధి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే వారి పై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ” రేడియేంట్ వరల్డ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 వ తేది ఎబి చంద్రరెడ్డి కల్యాణమండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పట్టణ,గ్రామీణ ప్రజలు
ఈ ఉచిత మెగా నేత్ర వైద్యశిబిరానికి విచ్చేసి కంటి వైద్య పరీక్షలు చేయించుకుని ఈ వైద్య శిబిరాన్ని
సద్వినియోపరుచుకోవాలని,ఈ ఉచిత వైద్యశిబిరానికి వచ్చే ప్రజలకు రవాణా సౌకర్యం,భోజన వసతి కల్పిస్తూన్నామన్నారు.
యువత ద్వారా అనేక సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో రాజంపేటలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక జాబ్ మేళాలను ప్రతినెల ఏర్పాటు చేస్థామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఎస్కే కరీమ్,టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్,తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రేవూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

