మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు నిర్వహించుకోవాలి.

Spread the love

ఎఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే.

కడప జిల్లా మార్చి 17

( నవ్యంధ్ర న్యూస్ )

మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని ఏ.ఎస్.పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సూచించారు.
పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మత పెద్దలతో శాంతి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏ.ఎస్.పీ మాట్లాడుతూ
మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో ఉగాది,రంజాన్‌,
శ్రీ రామనవమి పండుగలను నిర్వహించుకునేలా శాంతి సంఘ కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలన్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచార ఇవ్వాలన్నారు.
అనవసరమైన అంశాలనః అత్యుత్సాహంతో సోషల్‌ మీడియాలలో పోస్టు చేస్తే శాంతి కమిటీ సభ్యులు పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు..
ఈ సమావేశంలో పట్టణ ఎస్.ఐ పి. వెంకటేష్, మత పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *