తాడేపల్లి డిసెంబర్ 18
(నవ్యంధ్ర న్యూస్ )
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,ఎంపీ మేడా రఘునాథరెడ్డి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు.అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైన సందర్బంగా వైసీపీ నిర్వహించిన
ముఖ్యనేతల
విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు,ఎంపీలు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు,పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

