ముఖ్యమంత్రి సహాయ నిధి దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు.

Spread the love

ముఖ్యమంత్రి సహాయ నిధి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే వారి పై
కఠినచర్యలు తప్పవు.

కడప జిల్లా ఏప్రిల్ 08

(నవ్యంధ్ర న్యూస్ )

ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు,అత్యవసర పరిస్థితులలో సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పవిత్రమైన నిధి అని
ఈనిధులనుదుర్వినియోగం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పరిగణించాలని .
ముఖ్యమంత్రి సహాయ నిధులను దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెచ్చరించారు.
ఈ నిధుల అంశంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే వారిపైనా కఠిన చర్యలు తప్పవని
ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసే అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి సహాయ నిధి వినియోగం పై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమాచారం కోసం అధికారులను
సంప్రదించాలని,ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడినట్లు గమనించినట్లయితే, వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని
పేద బాధితులకు అందాల్సిన సహాయం సక్రమంగా చేరేలా పారదర్శకతతో చర్యలు తీసుకుంటామని చమర్తి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *