ప్రజాధనం ఖర్చు అధికార దుర్వినియోగం తప్ప!
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ ముఖ్యమంత్రి పర్యటన పై మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు,సోమవారం ఎన్టీయర్ భరోసా పింఛన్ల పంపిణి,ప్రజావేదిక, పర్యటనలోనియోజకవర్గ అభివృద్ధి పై వరాల జల్లు కురుపిస్తారని ప్రజలు ఆశలు
పెట్టుకున్నారన్నారు ముఖ్యమంత్రి పర్యటనలో రాజంపేట జిల్లా కేంద్రం హామీ ఇవ్వకపోవడంతో, పర్యటన వలన ఒరిగిందేమీ లేదని, తనకు తాను పొగుడుకోవడం, ప్రతిపక్షాన్ని విమర్శించడం మాటలు గారడిచేసి పోయారన్నారు
పెన్షన్లు పంపిణీ చేసేందుకు రావాల్సిన అవసరం లేదని,
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ ఫలాలు అందజేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు,
ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలైయాయని కొత్తగా ప్రత్యేకత ఏమీ లేదన్నారు.
కోట్లు రూపాయలు ప్రజాధనం,అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి ప్రకటించలేదన్నారు. అన్నమయ్య డ్యాం, కొట్టుకుపోయి మూడున్నర సంవత్సరమైన ఒక్క రూపాయి కేటాయించ
లేదని ముంపు బాధితులకు న్యాయం
జరగలేదన్నారు.డ్యాం నిర్మించిన చోటే నిర్మిస్తామని ప్రగడబాలు పలుకుతున్నారే తప్ప నిధులు కేటాయించ
లేదన్నారు.గాలేరు నగిరి, కాలువకు ఒక్క రూపాయి ప్రకటించలేదు కానీ,రైతులకు నీళ్లు లేకుండా,
రాయలసీమను, రతనాలసీమగా ఎలా చేస్తాడని ప్రశ్నించారు. ఎన్నికల వాగ్దానం, రాజంపేట జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాలల పై ఎలాంటి స్పష్టత ప్రకటించలేదన్నారు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మూసివేసిన ఆల్విన్ స్థానంలో ఎందుకు పరిశ్రమ ప్రకటించ
లేదన్నారు. మూసివేసిన పాల పరిశ్రమ ఎందుకు తెరిపించలేదన్నారు బోయినపల్లి తాళ్లపాకలో పర్యటించిన ముఖ్యమంత్రి అన్నమయ్య అభివృద్ధి, టూరిజం కోసం నిధులు ఎందుకు కేటాయించ
లేదన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తుడైన చంద్రబాబునాయుడు అన్నమయ్య జన్మించిన జన్మ స్థలంలోని సిద్దేశ్వర, చెన్నకేశవ,ఆలయాలను దర్శించుకోలేదన్నారు అన్నమయ్య కాలిబాట ప్రస్తావన,హౌసింగ్ గృహాల పై మాట్లాడలేదన్నారు. బీసీ కార్పొరేషన్ల ప్రస్తావన లేదన్నారు. పి4, నలుగురిని ఆదుకుని జిల్లా అంత అభివృద్ధి అయినట్లు
మాట్లాడారన్నారు. ప్రజల సమస్యలు తెలుపుకునేందుకు, ప్రతిపక్షాల్ని రాకుండా ఎస్పీకి చెప్పి, ముందస్తు అరెస్టులు చేశారని, 700 మంది పోలీసులు, బందోబస్తుకు ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాలుపడ్డారని, ప్రజాధనాన్ని,లక్షలాది రూపాయలు ఖర్చు చేశారని,చంద్రబాబు నాయుడు పర్యటన వల్ల, రాజంపేట నియోజకవర్గ ప్రజానీకానికి,జిల్లా, రైతులకు,విద్యార్థులకు,యువజనలకు,పేద
ప్రజలకు ప్రజావేదిక ఏమి వరాలు కురిపించ
లేదన్నారు వరాలు కురిపిస్తారని ఆశించిన నియోజకవర్గ ప్రజానీకం నిరాశ చెందారన్నారు. ఉపన్యాసాలతో, వ్యక్తిగత పొగడ్తలు , విమర్శలు తప్ప చంద్రబాబు పర్యటనతో లాభం కన్నా,ఎక్కువ నష్టమేనని విమర్శించారు. సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి పూర్తిగా
విఫలమయ్యారన్నారు.
జిల్లా కేంద్రం ప్రకటించక పోవడంతో ప్రభుత్వ విధానం పట్ల ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందన్నారు హక్కుల కోసం ప్రజలు ఉద్యోగులు,కార్మికులు, కర్షకులు,రైతులు,
విద్యార్థిలు,యువకులు ఐక్యంగా పోరాటాలతోనే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

