భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

Spread the love

కడప జిల్లా మార్చి 15

(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణం మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి మృతి కేసులో ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న నిందితుడు, మద్యానికి బానిసైన భార్యను వేధించడమే కాకుండా, ఆమె ఉరివేసుకుంటున్న దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ చనిపోవాలని ప్రేరేపించినట్లు విచారణలో తేలింది. ఇన్‌స్పెక్టర్ లింగప్ప నిందితుడిని ఇసుకపల్లి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుని, సెక్షన్ 108 BNS కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *