బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

Spread the love

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

కడప జిల్లా ఏప్రిల్ 05

(నవ్యంధ్ర న్యూస్ ).

స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు.
తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్రసమరయోధుడిగా,దళిత బాంధవుడిగా, అలుపెరగని పోరాట యోధుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి ఆదర్శప్రాయమన్నారు.
ఈ కార్యక్రమంలో నందలూరు సొసైటీ చైర్మన్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఎస్కే కరీమ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మేడా మధు, ఏనుగుల వంశి, కొమ్మి రామ్మోహన్, సాయి శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *