బొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటాం
మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
చిట్వేల్, పెనగులూరు మండలాలలో బొప్పాయి రైతులకు బొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చావుకూరి వెల్లడించారు. చిట్వేల్ మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం బొప్పాయి ధర నిర్ధారణ పై మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
గత నిర్ణయాలు
కిలోకు రు.8/-ల ధర
ఆగస్టు 1వ తేదీన రైల్వేకోడూరులో రైతులు, ట్రేడర్లు, దళారులను సమావేశపరిచి కోడూరు, ఓబులవారిపల్లె మండలాలలో బొప్పాయి కిలోకు రూ. 8గా ధరను నిర్ణయించారు. ఆగస్టు 28వ తేదీ వరకు అదే ధర కొనసాగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధరలు తగ్గకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ, హార్టికల్చర్ ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు మూడు, నాలుగు క్రాప్ లలో కాయల సైజు తక్కువగా ఉండడం వల్ల తక్కువ రేటుకు విక్రయం జరుగుతోందన్నారు
ప్రస్తుతం పరిస్థితి
చిట్వేల్, పెనుగులూరు మండలాలలో ఆలస్యంగా బొప్పాయి పంట వేయడం వల్ల కోడూరు, ఓబులవారిపల్లె ప్రాంతాలతో వున్న రేటు ప్రభావం చిట్వేల్ పెనుగలూరు మండలాలకు వ్యాపిస్తోందన్నారు
దిగుబడి వివరాలు
చిట్వేల్ లో మొత్తం బొప్పాయి దిగుబడి: 58,400 టన్నులు
ఇప్పటికే విక్రయం: 34,500 టన్నులు
ఇంకా విక్రయం చేయాల్సింది: 23,900 టన్నులు
మొదటి క్రాప్‌లో 2,300 టన్నులు, రెండో క్రాప్‌లో 6,700 టన్నులు కిలోకు రు.7/- ల నుండి రు. 8/- ల మధ్య విక్రయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు
మిగిలిన దిగుబడిని మూడు, నాలుగు క్రాప్లుగా వర్గీకరించి ట్రేడర్లతో సంప్రదించి కిలోకు రు. 7/-ల ప్రకారం విక్రయం జరిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు
రోజువారీ ధర నిర్ణయం
చిట్వేల్ ప్రాంతానికి చెందిన 56 మంది ట్రేడర్లు, ఢిల్లీ నుంచి వచ్చిన సేట్ లు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు సమావేశమై ధరను నిర్ణయించి కలెక్టరేట్‌కు తెలియజేస్తే తదనంతరం అదే ధరను మీడియా ద్వారా ప్రతిరోజు రైతులకు తెలియజేసి గందరగోళానికి తావులేకుండా చూస్తామన్నారు
చెక్ పోస్టులు, నిఘా చర్యలు
చిట్వేల్,పెనుగులూరు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి,వెహికల్ల రాకపోకలు, విక్రయ ధరల పై నిఘా కొనసాగించడంతో పాటు రైతులను ఇబ్బంది పెట్టే సెట్ లు,దళారుల సంబంధిత వ్యక్తుల సమాచారం సేకరించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు
ఇతర రాష్ట్రాలతో సమన్వయం
ఢిల్లీ, లక్నో వంటి రాష్ట్రాల హోల్‌సేల్ మార్కెట్ ధరలను పరిశీలిస్తూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు దసరా పండుగ సందర్భంగా ఇంకా ధర పెరిగే అవకాశం ఉందన్నారు
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
సేట్లు,దళారులు కావాలని రైతులను ఇబ్బంది పెట్టితే, వారిని నోట్ చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వారి ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తుందన్నారు

