అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
నాగోతు రమేష్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శనివారం రాజంపేట ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.
ఈ ఆత్మీయ సన్మాన సభలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,కూటమి నేతలు,అభిమానులు, స్థానిక నేతలు , కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విరివిగా పాల్గొని నాగోతు రమేష్ నాయుడును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

