ప్లాస్మా చికిత్స ఉచితంగా అందిస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ ఆసుపత్రి

Spread the love

విశాఖలో ఇక్కడ మాత్రమే మోకాళ్ల నొప్పులకు ‘ప్లాస్మా’ చికిత్స

విశాఖపట్నం ( నవ్యాంధ్ర న్యూస్ )

విశాఖలోని విమ్స్ ఆస్పత్రి (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ) కేజీహెచ్ కు ప్రత్యామ్నాయంగా మారబోతోంది. ఇక్కడ మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉందని శుక్రవారం ఆ విభాగాధిపతి డా. భవానీ ప్రసాద్ తెలిపారు. ఇదే చికిత్స బయట చేయించుకోవాలంటే రూ. వేలల్లో ఖర్చవుతుందని అన్నారు. ప్లాస్మా చికిత్స అందిస్తున్న తొలి ప్రభుత్వాసుపత్రి కూడా ఇదేనని విమ్ డైరెక్టర్ డా.కె.రాంబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *