పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒక అండ,
కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వెన్నుచూపని ధైర్యవంతుడు..
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21
(నవ్యంధ్ర న్యూస్ )
తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులుగా
నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబు
యంగ్ టైగర్, డైనమిక్ లీడర్‌గా అంకితభావంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబును జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించడం ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు గర్వకారణంగా ఉందని అభిమానులు హర్షం వ్యక్తః చేస్తున్నారు.
కార్యకర్తలకు అండగా నిలబడుతూ,పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూర్చే నాయకత్వ లక్షణాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయని ఎప్పుడు
ఏ ఆపద వచ్చినా ముందుండి నడిచే వ్యక్తిగా,కార్యకర్తల హక్కుల కోసం ధైర్యంగా పోరాడే నాయకుడిగా సుగవాసి ప్రసాద్ బాబు తెలుగుదేశం పార్టీకి బలమైన స్తంభంలా నిలుస్తూన్న సమర్థవంతమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మనఃపూర్వక కృతజ్ఞతలుతెలియజేస్తూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని,ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని అభిమానులు
ఆకాంక్షిస్తున్నారు.

