ప్రారంబానికి నోచుకోని సచివాలయం

Spread the love

ఈ సచివాలయం ప్రారంభానికి నోచుకునేదేప్పుడో

సచివాలయ పనులు
పూర్తయి ఏడేండ్లు

ప్రారంభనికి సిద్ధంగా ఉన్న సచివాలయాన్ని ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటి

సచివాలయానికి లక్షలలో అద్దె చెల్లిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూన్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న
ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు

సచివాలయ ప్రారంభ అంశాన్ని ఎన్నిసార్లు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధులే లేరు

కడప జిల్లా మార్చి 22

(నవ్యంధ్ర న్యూస్ )


నందలూరు మండలపరిధిలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోని సచివాలయం – 1 పనులు పూర్తయి ఏడేండ్లవుతున్న ప్రారంబించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సచివాలయా నిర్మాణానికి, గ్రామపంచాయతీ,
సచివాలయం అద్దె భవనాలలో నిర్వహిస్తూ లక్షలలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఎమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ప్రారంభ అంశాన్ని ఎన్నిసార్లు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు,
ఉన్నతాధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. జిల్లాలోనే నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీకి ప్రత్యేక గుర్తింపు వుంది. జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలో ఈ పంచాయతీ కూడా ఒకటిగా చెప్పొచ్చు. అనేక సంవత్సరాలుగా గ్రామపంచాయతీ ప్రజలకు సేవలు అందించిన కార్యాలయాన్ని పడగొట్టి సచివాల నిర్మాణానికి ఏడేళ్ల క్రితం 40 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఎన్నో సమస్యల చరిత్ర కలిగిన గ్రామపంచాయతీ కార్యాలయం అక్కడే ఉంచాల్సింది పోయి దాన్ని పగలగొట్టి కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. అనేక మేజర్ గ్రామపంచాయతీలలో గ్రామపంచాయతీ కార్యాలయం అక్కడే ఉండిచ్చి నూతన సచివాలయాలను పక్కన నిర్మించారు. అయితే ఇక్కడి అప్పటి ప్రజాప్రతినిధుల నియంతృత్వ ధోరణి మూలంగా బాగా ఉన్న కార్యాలయం పగలగొట్టి సచివాలయం నిర్మాణం చేపట్టడం దారుణమైన విషయం. అయితే సచివాలయ నిర్మాణం చేపట్టి ఎడేళ్లు కావస్తున్న ఇప్పటికి దానిని ప్రజలకు అందుబాటులోకి తెగ పోవడం బాధాకరం. వైపు కాంట్రాక్టర్ మరోవైపు అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షల రూపాయల ప్రజాధనం వృధాగా బాడిగ రూపంలో చెల్లిస్తుండడం జరుగుతుంది. సచివాలయం లోపల విద్యుత్తు పనులు చిన్న చిన్న పనులు ఉన్నప్పటికీ దాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన అధికారులకు లేకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు అన్ని పూర్తయి ప్రజలకు సేవలు అందిస్తున్న ప్పటికీ నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం మాత్రం ఇప్పటికి ప్రారంభించకపోవడం లో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. ప్రస్తుత పాలకవర్గం అనేకమార్లు అధికారులకు తెలిపిన వారు పట్టినట్లు వ్యవహరించడంతో కాంట్రాక్టర్ కూడా ఇందుకు సహకారం అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం రాజకీయం మూలంగానే ఈ సచివాలయం ప్రారంభించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోనే పూర్తి చేసి ప్రారంభించాల్సిన ఈ సచివాలయం పనులు అ ట కెక్కించారు.. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్న ఈ సచివాలయం వ్యవహారంపై దృశ్చారించకపోవడం లో ఆంతర్యం అర్థం కాని విషయం గా మారింది. ఇక పంచాయతీరాజ్ శాఖ అధికారులు సచివాల య నిర్మాణం పూర్తి చేసి గ్రామపంచాయతీకి అప్పగించాల్సిన బాధ్యతను విస్మరించడంతో గత ఏడేళ్లుగా లక్షలాది రూపాయల ప్రజాధనం బాడిగు రూపంలో పోతుండడం జరుగుతుంది. మరి ఎంత జరుగుతున్న అధికార యంత్రాంగం ఇప్పటికి స్పందించకపోవడం పట్టినట్లు వ్యవహరించడం వెనక రాజకీయ కుట్ర ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం పరిపాలన ఏప్రిల్ రెండో తేదీకి ముగుస్తున్నప్పటికీ వారి నూతన సచివాలయ ప్రారంభమసులు ఆవిరి అయినట్లేనని చెప్పవచ్చు. సచివాల సమస్యలన్నీ అధికారులకు తెలిసిన అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ఈ సచివాలయ నిర్మాణం అరకెక్కించడం గమనార్హం. ఇక అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి సచివాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *