కడప జిల్లా మార్చి 06
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట ప్రభుత్వ వైద్యశాలలో గురువారం తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన ఇరువురి సుబ్రహ్మణ్యం సతీమణి ఇరువురి శంకరమ్మ గర్భం లోపలే చనిపోయిన పిండాన్ని డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ వైద్యులు అనిల్ నేతృత్వంలో అనస్థటిస్ట్ వైద్యులు అబూబకర్,ఫిజీషియన్ వైద్యులు గిరి పర్యవేక్షణలో ఓటీ సిస్టర్ సరళ,శ్రీలక్ష్మి, అసిస్టెంట్ విజయ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను తీసి తల్లికి ఏ ప్రమాదం లేకుండా ఆపరేషన్ విజయవంతంగా చేసిన అనంతరం శంకరమ్మ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపర్నెంట్ గా డాక్టర్ పివిఎన్ రాజు తెలియజేసారు.
ఈ సందర్బంగా సూపర్డెంట్ పివిఎస్ రాజు మాట్లాడుతూ ఈ ఆపరేషన్ ఆసుపత్రికే ఒక గర్వకారణమైన ఆపరేషన్ అని ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులను ఈ సందర్బంగా
అభినందించినారు.

