అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు
ఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజు
మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్ని
సద్వినియోగం చేసుకుని పోలియో రహిత సమాజమజానికి సహకరించి ప్రభుత్వ ఆశయాన్ని విజవంతం చేయాలన్నారు.ప్రతి ఒక్కరు పోలియో పై అవగాహన కలిగి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరు కచ్చితంగా రెండు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్నారు. సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్న పిల్లల తల్లి తండ్రులు పోలియో చుక్కలు వేస్తున్న కేంద్రాల వద్దకు పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పోలియో సిబ్బంది, ప్రభుత్వ ఐటిఐ
విద్యార్థిని,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

