ప్రజా సేవ చేసే భాగ్యం లభించడం మన అదృష్టం.

Spread the love

ఘనంగా సర్పంచుల సత్కార వీడ్కోలు సభ.

కడప జిల్లా ఏప్రిల్ 07

(నవ్యంధ్ర న్యూస్ )

ప్రజాసేవ చేసే భాగ్యం లభించడం మన అందరి అదృష్టమని నందలూరు మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు.
అరవపల్లి షాది ఖానాలో మంగళవారం సర్పంచుల ఆత్మీయ వీడ్కోలు
సన్మానసభ మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు జంబు సూర్యనారాయణ లంకాయి గారి నరసయ్య మోడపోతుల సుభాషిని రాము చుక్క యానాది మొయినుద్దీన్ లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పాలకవర్గ సభ్యుల అధికారుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. నిధుల సమస్యతో గ్రామ
పంచాయతీల అభివృద్ధి అనుకున్న స్థాయిలో చేయలేకపోయామన్నారు.
ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించమని ఐదేళ్లపాటు తాము అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేక
పోయినందుకు ప్రజలకు క్షమాపణ
చెబుతున్నామన్నారు. గ్రామపంచాయతీలో పనిచేసే సర్పంచ్ పాలక
వర్గ సభ్యులు సచివాలయ సిబ్బందూలందరు ఒక కుటుంబంలా కలిసి మెలిసి పనిచేశామన్నారు.
గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఆదాయ వనరుల పై దృష్టి సారించినప్పుడే
ఆ పంచాయతీ అభివృద్ధి చెందుతుందన్నారు.
అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారించలేదని సమస్యల పరిష్కార బాధ్యత వచ్చే సర్పంచుల పై ఉంటుందన్నారు. ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మండల డిప్యూటీ ఎంపీడీవో మాల్యాద్రి మాట్లాడుతూ సర్పంచ్ ల సహకారంతో గ్రామ
పంచాయతీలో ప్రతి సమస్యను పరిష్కరించామని మండలంలోని గ్రామపంచాయతీలో కార్యదర్శులు సర్పంచ్ తో కలిసి పనిచేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసిన ఘనత సర్పంచులదేన్నన్నారు. త్రాగునీరు,పారిశుద్ధ్యం, వీధిలైట్ల ప్రధాన సమస్యల పై దృష్టి సారించామన్నారు.
అవకాశం వస్తే మళ్లీ మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ఏ
ఈ వెంకటరమణ,సర్పంచ్ లందరూ ప్రజలు ఎక్కడ తాగునీటికి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దుష్టి సారించారని వారి సేవలు అమోఘమన్నారు.. అనంతరం మండలంలోని గ్రామకార్యదర్శులను గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యులను సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.
మాజీ సర్పంచులను పాలకవర్గ సభ్యులు కార్యదర్శులు అధికారులు సచివాలయ సిబ్బంది శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక కార్యదర్శి శ్రీనివాసులు,కార్యదర్శులు వెంకటసుబ్బయ్య,హనీఫ్, సుబ్బనరసయ్య,సంపత్, వార్డు సభ్యులు ప్రసాద్, గంగాధర్,మారే శివకుమార్,శంకర, ఉమామహేశ్వరి,
ఎముక లక్ష్మీదేవి,అశ్విని,
వసంత,వరలక్ష్మి, వెంకటసుబ్బయ్య, ఆదినారాయణ,నాగేంద్ర, మస్తాన్,దుర్గయ్య., మహబూబ్ బాషా,
ప్రవీణ్ కుమార్, మహాలక్ష్మమ్మ,మదన మోహనపురం,లేబాక, టంగుటూరు,ఆడపూరు, ఎర్రచెరువుపల్లి,నందలూరు, నాగిరెడ్డిపల్లి,పోత్తపి,
టీవీపురం,గ్రామ పంచాయతీల సచివాలయ సిబ్బంది,కార్యదర్శులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *