కడప జిల్లా 20
(నవ్యంధ్ర న్యూస్ )
ఒలంపియాడ్ ప్రతిభా పరీక్షలో రాజు హై స్కూల్ విద్యార్ధులు విజయ పరంపర కొనసాగిస్తూ ప్రతిభ కనపరిచారని
ఇటీవల మ్యాథ్స్ ఒలంపియాడ్ లో రాజు హై స్కూల్ కు చెందిన విద్యార్థి ప్రథమ ర్యాంక్ సాధించడంతో పాటు మరో ఐదు టాప్ ర్యాంకులు సాధించారు. సైన్స్ ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో రాజు హై స్కూల్ కు చెందిన రెండు బ్రాంచ్ ల విద్యార్ధులు సత్తా చాటి ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షలో తమకు తామే సాటి అనినిరూపించారు. సైన్స్ ఒలంపియాడ్ లో గోల్డ్ మెడల్ ఆఫ్ డిస్టెన్స న్ 26 మంది, గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్స లెన్స్ 66 మంది సాదించారు. సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్ధులను శుక్రవారం రాజు హై స్కూల్ లో సీఈఓ గుంటిమడుగు రఘురామరాజు, ఫస్ట్ బ్రాంచ్ హెచ్ఎం వి.మోహన్ రెడ్డి, సెకండ్ బ్రాంచ్ హెచ్ఎం గొల్ల బాలగంగాధర్, ఏఓ మల్లారెడ్డి, ఫస్ట్ బ్రాంచ్ లోయర్ సెక్షన్ ఇంచార్జ్ హబీబ్, సెకండ్ బ్రాంచ్ లోయర్ సెక్షన్ ఇంచార్జ్ గుర్రంకొండ కృష్ణవేణిలు అభినందించారు.
ఈ సందర్భంగా సీఈఓ గుంటిమడుగు రఘురామరాజు, హెచ్ఎం లు వి.మోహన్ రెడ్డి ,బాలగంగాధర్, ఏఓ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటు ప్రతిభా పరీక్షల్లోనూ, అటు పోటీ పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ర్యాంక్ లు, గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధిస్తుండటం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పాఠశాల యాజమాన్యంపై పెట్టుకున్న నమ్మకాని ఉపాధ్యాయులు వమ్ము చేయకుండా విద్యార్ధులు విద్యలో ప్రతిభ కనబరిచేలా బోధనలు చేస్తున్నందునే విద్యార్ధులు ర్యాంకులను సాధిస్తున్నారని తెలిపారు. ఒలంపియాడ్ ఫలితాల స్ఫూర్తితో మునుముందు విద్యార్ధుల తల్లిదండ్రుల ఆకాంక్షమేరకు మంచి ఫలితాలు సాధిస్తామని వారు తెలిపారు.

