కడప జిల్లా మార్చి 02
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయకస్వామి,
శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 6 గంటలకు యధావిధిగా
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు చంద్రమౌళి తెలిపారు.యధావిధిగా అభిషేకం తదుపరి భక్తులకు ప్రసాదం వినియోగంతో పాటు
పంచామృతాభిషేకం ఉంటుంది కావున భక్తులు యధావిధిగా పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. అభిషేకం అనంతరం గ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల తరువాత ఆలయాన్ని మూసివేసి, రాత్రి 8 గంటలకు శుద్ధి తరువాత భక్తులకు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి,
బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వాముల దర్శనం రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు.

