దేవుని లడ్డు ప్రసాదల పై కుటమి నేతలు చేస్తున్న రాద్ధాంతం,తప్పుడు ఆరోపణల పై వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు అకేపాటి మీడియా సమావేశం.

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 10

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిధిలోని అకేపాడు గ్రామపంచాయతీలోని
అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం పై కుటమి ప్రభుత్వం చేస్తున్న రాద్దాం పై వైఎస్ఆర్సిపి
శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ రెడ్డి మీడియా సమావేశం.
నిర్వహించారు.
ఈ సందర్బంగా అకేపాటి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని
వైసీపీ హాయంలో సిబిఐ రిపోర్టులో తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరగలేదన్న ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గత తెలుగుదేశం హాయంలోనే తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగడం అక్షర సత్యమని
చంద్రబాబు చేసిన తప్పును కప్పి
పుచ్చుకునేందుకు వైసీపీ పై నిందారోపణలు చేయడం చాలా దుర్మార్గమన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి లడ్డులో నెయ్యి కల్తీ జరిగి ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళతారని, తప్పుడు ఆరోపణల పై స్వయంగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడును మందలించిన వెనక్కు తగ్గని కూటమి నేతలు
సిగ్గు ఎగ్గు లేకుండా వైసీపీ పై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారన్నారు.
శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం పై కుటమి నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రపంచ
వ్యాప్తంగా తెలుగు వారు, వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారన్నారు.
తప్పుడు ఆరోపణ చేస్తున్న చంద్రబాబు నాయుడును వెంకటేశ్వర స్వామి క్షమించడని,ఎప్పటికైనా శిక్షించే తీరుతాడన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *