తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం

Spread the love

సైనిక స్కూల్ కు ఎంపికైన రాజు హై స్కూల్ విద్యార్ధులు

కడప జిల్లా మార్చి 02

(నవ్యంధ్ర న్యూస్ ).

రాజు హై స్కూల్ లో సెల్ఫ్ రీడింగ్ గ్రూపు ప్రారంభించిన తొలిఏడాదిలోనే ఒలంపియాడ్ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు జె.మౌనిష్,సి.సాహిత్ లు సైనిక్ స్కూల్ కు ఎంపిక అయ్యారు. సైనిక్ స్కూల్ కు ఎంపిక అయిన విద్యార్థులను సోమవారం రాజు హై స్కూల్ సీఈఓ గుంటిమడుగు
రఘురామరాజు,హెచ్ఎం వి.మోహన్ రెడ్డి,అకడమిక్ ఇంచార్జ్ హబీబ్ లు మెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సెల్ఫ్ రీడింగ్ గ్రూపు ప్రారభించిన తొలి ఏడాదిలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ మార్కులతో, ర్యాంక్ లు సాధించి సైనిక స్కూల్ కు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఫలితాల సాధనలో తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జి.సుప్రియ, గాయత్రి, ఫర్హానల కృషి ఎంతో ఉందన్నారు.
ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థులు సైనిక్ స్కూల్ లో సీట్లు సాధించాలి అన్న పట్టుదలతో శ్రమించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *