తెలుగుదేశం పార్టీ బలోపేతాని కై కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు.​కడప జిల్లా మార్చి 26

Spread the love

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు .
మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు,మంత్రి లోకేష్ కు క్షుణ్ణంగా వివరించారు. నాయకులు,కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *