తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలు తాత్కాలికంగా మూసి వేయనున్న టీటీడీ అధికారులు

Spread the love

తిరుపతి సెప్టెంబర్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 3:30 గంటల నుంచి సోమవారం ఉ 3 గంటలకు వరకు దర్శనాలు
నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు
శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం కంపార్టమెంట్ల షెడ్లు,క్యూలైన్లు నిండిఉన్నందున
భక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని నిలిపివేసమన్నారు
భక్తులు పీఏసి 1,2&3 హల్స్ లో వేచి ఉండి సోమవారం ఉ 6 గంటలకు క్యూలైన్ లోకి ప్రవేశించన్నారు
ఆదివారం రాత్రి 9:50 గంటల నుండి సోమవారం వేకువజామున 1:31 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్నందున
గ్రహణం విడిచాక శుద్ధి, పుణ్యాహవచనం చేసి నిత్యసేవలను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఆర్జిత సేవలు, సోమవారం విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసమన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *