డిడిఓ కార్యాలయాల ఏర్పాటుతోపంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం.

Spread the love

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04

( నవ్యంధ్ర న్యూస్ )

జిల్లాలోని ప్రతి డివిజన్ లో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటుతో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.
రాజంపేటమండలపరిధిలోని బోయినపల్లిలో ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,సబ్ కలెక్టర్ భావనతో కలిసి తెలుగుదేశం నియోజకవర్గఇన్చార్జ్ జగన్మోహన్ రాజు,జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1973లో ప్రారంభమైన పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాలు,మండలాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించిందన్నారు.
ఈ అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమన్నారు.
డివిషనల్ అభివృద్ధి కార్యాలయాల
ఏర్పాటుతో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈవ్యవస్థీకృత మార్పుతో గ్రామాలు మరింతఅభివృద్ధి చెందుతాయన్నారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుందని, డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల
ఏర్పాటుతో గ్రామాలు, మండలాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో
తాసిల్దార్ పీర్ మున్ని, డిపిఓ రాధమ్మ,టిడిపి,
జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *