జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించేంత వరకు
ఈ ఉద్యమం ఆగదు,
జిల్లా సాదీంచేందుకు
ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన జేఎసి నాయకులు
అన్నమయ్య జిల్లా నవంబర్ 01
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో సోమవారం జేఎసి నాయకుల ఆధ్వర్యంలో జిల్లా సాధన అంశాల పై చర్చ సమావేశంనిర్వహించారుఈ సందర్బంగా జేఎసి నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించెంతవరకు
ఈ ఉద్యమం ఆగదు, తీవ్రతరం చేస్తామని
ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ పూల భాస్కర్, సిపిఐ రవికుమార్, ప్రభాకర్ నాయుడు, సిపిఎం సికిందర్,తెలుగుదేశం మార్కెట్ కమిటీ అధ్యక్షులు సుబ్బ నరసయ్య,గ్రామీణ అధ్యక్షులు మేడికొండు రవికుమార్, మాజీ మండల అధ్యక్షులు కౌన్సిలర్ సంజీవ నాయుడు,
మైనార్టీ నాయకులు అబుబకర్ ,అబ్దుల్లా, రమేష్,ఆదినారాయణ, రవి,ఈశ్వరయ్య,
కూచివారిపల్లి నాయకులు మల్లికార్జున నాయుడు,సుబ్రహ్మణ్యం, నర్సింహులు,
చింతల శివ, వర్ధిబోయిన సుధాకర్ బాబు,పలువురు స్వచ్చందంగా పాల్గొని అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమాన్ని వృద్ధత్తం చేస్తామని పిలుపు నిచ్చారు. జిల్లా సాధనే జేఎసి నాయకుల ఎజెండా అన్నారు.
జిల్లా సాధనలో భాగంగా ముస్లిం సోదరులు శుక్రవారం మసీదుల వద్ద సంఘీభావంగా తెలియజేసి కార్యచరణ ప్రకటించి దిన దినం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి రాజంపేట జిల్లా కేంద్రం సాధించేవరకు ఉద్యమిస్తామన్నారు.

