అన్నమయ్య జిల్లా డిసెంబర్ 02
(నవ్యంధ్ర న్యూస్)
రాజంపేట మండల
పరిధిలోని ఎగువ బసినాయుడు గారి పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మహిళలు ఫ్లక్కాడలు చేతపట్టి జిల్లా కేంద్రంగా రాజంపేటను
ప్రకటించాలంటు
నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకుని
జిల్లాకేంద్రంగా
రాజంపేటను చేయాలని గ్రామ గ్రామాల నుంచి కదిలి కధం తొక్కుతూ నిరసన చేపట్టారు.
గ్రామ,గ్రామాలలోని మహిళలు,గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని జిల్లా కేంద్రం జాయింట్ యాక్షన్ కమిటీకి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించే వరకు
మా వంతు మేము సంఘీభావంగా
మా గ్రామంలో నిరసన చేపట్టి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మాజీ తెలుగుదేశం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో
ఈ నిరసన కార్యక్రమం చేపట్టిప్రజలందరూ ముక్తకంఠంతో జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు
లక్ష్మీనారాయణ,
పూలభాస్కర్,
ప్రభాకర్ నాయుడు,
చల్లా సుధాకర్, మేడికొండ రవి, సురేష్, మహదేవయ్య తదితరులు పాల్గొన్నారు.

