అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్టమొదటిసారి రాజంపేటకు విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు,
అభిమానులు పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు రాజంపేట పట్టణంలోని ఏబి.చంద్రా రెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ప్రియతమ మంత్రివర్యులు జిల్లాల పునర్ విభజన కమిటీ సభ్యులు సత్యకుమార్ యాదవ్,నాగోతు రమేష్ నాయుడులను ఘనంగా సత్కరించి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని సహేతుకమైన విజ్ఞప్తిని నియోజక వర్గ ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజుతో కలసి వినతిపత్రాన్ని, పార్లమెంట్ కేంద్రంగా ఉన్న రాజంపేటకు ఎలా అన్యాయం జరిగిందో మంత్రికి వివరించి న్యాయం చేయాలని కోరుతూ సమర్పించారు అమాత్యులు సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
జిల్లా ప్రతిపాదన పై సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులకు జాయింట్ ఆక్షన్ కమిటీ సభ్యులు ధన్య వాదములు తెలియజేసారు

