అన్నమయ్య జిల్లా ఆగస్టు 28
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం నుండి బైపాస్ లోని నందమూరి తారక రామారావు విగ్రహ కూడలి వరకు జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జేఎసి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు ఈ మౌన ప్రదర్శన మార్కెట్ మీదుగా పాత బస్టాండ్ బైపాస్ లోని నందమూరి తారక రామారావు కూడలి వరకు కోన సాగింది. రహదారి పొడవున మహిళలు,కూటమి నాయకులు,ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వ్యాపారవర్గాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,ప్రజలు
ఈ మౌన ప్రదర్శనలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేసారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజంపేటలో బ్రిటిష్ కాలంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయం,ప్రధాన పట్టణాలకు రైలు సౌకర్యం,అపార జల సంపద,ఉద్యాన
వనపంటలు,ఉత్తమమైన ఖనిజాలు కల్గి ఉండి టూరిస్ట్ హబ్,చారిత్రక అంశాలు కల్గి అన్నమయ్య పుట్టి నడయాడిన గడ్డగా ప్రసిద్ధి చెందిన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడం ఎంతో సముచితమని.. ప్రియతమ ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్,బీజేపీ నాయకులు ఈ అంశం పై చక్కటి నిర్ణయం తీసుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు
.

