అన్నమయ్య జిల్లా డిసెంబర్ 26
(నవ్యంధ్ర న్యూస్ ).
జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, న్యాయమూర్తుల, భారతీయ విద్యానికేతన్, శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల అధినేత, లయన్స్ క్లబ్ లైన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా జాయింట్ యాక్షన్ కమిటీ ( జేఎసి ) నాయకులు, కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మండలపరిధిలోని
బోయినపల్లి 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద,ఇటీవల ప్రారంభించిన
శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నమయ్య విగ్రహానికి వినతిపత్రం సమర్పించి,రాజంపేట ముద్దు రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేసి, వంటవార్పు నిర్వహించి నిరసన తెలియజేసి
గత ప్రభుత్వ హయాంలో రాజంపేటకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రాజంపేటను రాష్ట్ర ముఖ్యమంత్రి,
ఉపముఖ్యమంత్రి, పాలకులను వేడుకుంటున్నామన్నారుఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు,విద్యార్థులు,
తదితరులు పాల్గొన్నారు.

