జిల్లాకేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పుల్లంపేట విద్యార్థులచే ర్యాలీ.

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10

(నవ్యంధ్ర న్యూస్ )

పద కవిత పితామహుడు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్యనడయాడిన ప్రాంతమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బుధవారం పుల్లంపేటలో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ,మానవహారం కార్యక్రమాన్ని
నిర్వహించారు
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ద్వారక గోపీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని ప్రకటించి రాజంపేట ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. రాజంపేట గత 40 సంవత్సరాలుగా పార్లమెంట్,శాసనసభ కేంద్రంగా ఉందని నందలూరులో ఆల్విన్ ఫ్యాక్టరీ లోకో షెడ్ పరిశ్రమ ఉండడం వల్ల ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేవి ప్రస్తుతం అవి మూతపడడంతో నిరుద్యోగం విలయ
తాండవం చేస్తున్నదని రాయచోటికి వెళ్లాలంటే రెండు బస్సులు రెండు కొండలు దాటుకొని వెళ్తే గాని జిల్లా కలెక్టర్,ఎస్పీ కార్యాలయాలకు చేరుకోలెమన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో అక్కడికి వెళ్లిన ఆ సమయంలో అధికారులు లేకపోతే ప్రజలు వ్యయ ప్రయాసలతో తిరిగి రావాల్సిన్నారు.
రాత్రి 7:00 దాటితే రాజంపేటకు వచ్చేందుకు బస్సులు ఉండవు గత పాలకులు చేసిన పని వల్ల రాజంపేటకు జిల్లా కేంద్రం కాకుండా పోవడం బాధాకరమని ఎప్పటికైనా కూటమి ప్రభుత్వ పాలకులు గత పాలకులు చేసిన
తప్పిధమే చేయకుండా స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సోము బాలాజీ నాగభూషణం బాబు, శ్రీనివాసులు, మను, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *