జనసేన లీగల్ సెల్ కన్వీనర్ కత్తి సుబ్బరాయుడును ఘనంగా సత్కారించిన జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు.

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 07

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణ శివార్లలోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్ లో ఇటీవల నిర్వహించిన
న్యాయవాదుల సంఘ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్షులు ఎన్నికైన
కత్తి సుబ్బరాయుడును మంగళవారం జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ జననేత యల్లటూరు శ్రీనివాసులరాజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ,జనసేన అభివృద్ధికి కత్తి సుబ్బరాయుడు కృషి ప్రశంసనీయమన్నారు.. భవిష్యత్ లో పార్టీ బలోపేతానికి కత్తి సుబ్బారాయుడు నిరంతరం సేవలు అందిస్తారని
ఆశభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యల్లటూరు శివరామ రాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,తెలుగుదేశం సీనియర్ నాయకులు మండెం అబూబకర్, జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ, చలపతి,కొండహరి,ఆకుల చలపతి,పూల లక్ష్మీ నరసయ్య,పత్తి నారాయణ ,గాజులకు కులాయప్ప, మౌల ,పిచ్చయ్య నాయుడు , సాంబారు రాజశేఖర్ ,చింతల రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కత్తి సుబ్బరాయుడుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *