ఎపి ఎన్జిఓస్ అధ్యక్ష, కార్యదర్శులను అభినందించి శాలువాతో ఘనంగా సత్కారించిన యల్లటూరు శ్రీనివాసులు రాజు
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణ
శివార్లలోని యల్లమ్మ ఆలయ సమీపంలోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్ లో గురువారం నూతనంగా ఎన్నికైన ఎపి ఎన్జిఓస్ తాలూకా అధ్యక్షులుగా మేరువ వరదయ్య, కార్యదర్శిగా టి. విజయ్ కృష్ణ (కుమారస్వామి) లు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు ఎపి ఎన్జిఓస్ అధ్యక్ష,కార్యదర్శిలుగా నియమితులైన వరదయ్య, కుమార్ స్వామిలను అభినందించారు.

