3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
సెప్టెంబర్13 న తేది నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చెయ్యాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు, పోలీస్,బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో న్యాయస్థానంలో శనివారం సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజీ కావలసిన కేసుల కక్షిదారులను పిలిపించి రాజీ చేసుకునే విధంగా ఆయా అధికారులు కృషి చేయాలన్నారు. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు ప్రశాంతంగా జీవించాలన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని కక్షిదారులు తమ వివాదాలు పరిష్కరించు
కోవాలనుకునే వారికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. ప్రజలందరూ ఈ జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించు కోవాలన్నారు
ఈ సమావేశంలో పోలీస్,,బ్యాంకు అధికారులు,బార్ అధ్యక్షులు హనుమత్ నాయుడు ఎపిపి, న్యాయవాదులు పాల్గొన్నారు

