కడప జిల్లా ఫిబ్రవరి 25
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండల
పరిధిలోని వెంకటరాజంపేటలో
శ్రీ కనకదుర్గ మహేశ్వర దేవస్థాన 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు బుధవారం
శ్రీ కనకదుర్గమ్మతల్లికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేకలంకారముతో
శ్రీ కనకదుర్గమ్మ భక్తులుకు దర్శనమిచ్చారు
ఈ ఆలయంలో గత 20 సంవత్సరాలుగా దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది అలంకరణలతో దేవుడు దర్శనమిస్తారు అదేవిధంగా శివరాత్రికి మూడు రోజులు ఆలయంలో కళ్యాణము మరియు మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతి శుక్రవారం పరిసర ప్రాంతాలలోని భక్తులు అమ్మవారినిదర్శించు
కుంటారు.

