అన్నమయ్య జిల్లా అక్టోబర్ 24
(నవ్యంద్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేసి సంబరాలలా నిర్వహించడం ప్రభాస్ అభిమానులందరికి ఒక పండుగలా ఉందన్నారు. ఈ పుట్టినరోజు వేడుక సంబరాలలో రాజంపేట పట్టణ,గ్రామీణ పరిసర ప్రాంత అభిమానులు పాల్గొన్నారు.

