సంప్రదాయ దుస్తులతో సందడి చేసిన విద్యార్ధులు.
కడప జిల్లా మార్చి 18
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లి,వెంకటపల్లి రోడ్డులలోని రాజు హై స్కూల్ మొదటి,రెండవ బ్రాంచ్ లలో ముందస్తు ఉగాది వేడులను బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక స్వామికి విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజు హై స్కూల్ సీఈఓ గుంటిమడుగు
రఘురామరాజు, మొదటి బ్రాంచ్ హెచ్ఎం వి.మోహన్ రెడ్డి,రెండవ బ్రాంచ్ హెచ్ఎం గోళ్ల బాలగంగాధర్, ఏఓ మల్లారెడ్డి లు ఉగాది విశిష్టతను,తెలుగువారికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి పండుగను విద్యార్థిని, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.. పరాభవ నామ సంవత్సరంలో విద్యార్థులందరికీ మంచి జరిగి ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని ఆకాంక్షించారు.ఉగాదిని పురస్కరించుకొని పలువురు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. ఈకార్యక్రమంలో రాజు హై స్కూల్ మొదటి బ్రాంచ్ లోయర్ సెక్షన్ ఇంచార్జ్ హబీబ్, రెండవ బ్రాంచ్ అగ్రిగేటర్ కృష్ణవేణి, ఉపాధ్యాయిని,
ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

